Monday, December 23, 2024

ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్ లో చిక్కుకున్న ముగ్గురు విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న స్కైవాక్ లిఫ్ట్ లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో అది మధ్యలోనే నిలిచిపోయింది.  అందులో ముగ్గురు విద్యార్థులు చిక్కుకు పోయారు. ఎంతసేపటికి తెరుచుకోకపోవడంతో వారు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందాక నిపాందిగా అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులను కాపాడారు. లిఫ్ట్ లో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసినా స్పందన కరువైందని చిక్కుబడిన విద్యార్థులు తెలిపారు. గతంలో కూడా ఉప్పల్ లో ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు మేలుకోవడం లేదు. పట్టించుకోవడంలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News