నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ పరిధిలో గల బోర్గాం ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన రెండు గంటల తరువాత ఇద్దరు విద్యార్థులు కడుపు నొప్పిలేస్తుందని చెప్పగా ఉపాధ్యాయులు డాక్టర్‌ను పిలిపించి టాబ్లెట్స్ వేశారు. ఆ తరువాత మరికొందరు కడుపు నొప్పి అనడంతో పాటు ఒకరిద్దరు వాంతులు చేసుకున్నారు. దాంతో అంబులెన్స్‌లో ప్రభుత్వ దవాఖానాకు తరలించామని ఎంఈఓ రామారావు తెలిపారు. 16 మంది విద్యార్థులకు వైద్యం అందిస్తున్నామని, విద్యార్థులు బాగానే ఉన్నారని తెలిపారు. మధ్యాహ్న సమయంలో విద్యార్థులు బయట నుంచి కొనుగోలు చేసిన తినుబండారాల వల్లే జరిగి ఉండవచ్చని, లేనిపక్షంలో ఒకటి, రెండవ, మూడో తరగతి విద్యార్థులకు కూడా అస్వస్థతకు లోనయ్యే వారని ఎంఈఓ తెలిపారు. మధ్యాహ్న భోజనం వల్ల జరిగిందా? విద్యార్థులు బయట నుంచి తెచ్చుకున్న ఆహారం వల్ల జరిగిందో తెలియాల్సి ఉంది.
మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
- Advertisement -
- Advertisement -
- Advertisement -