Friday, December 20, 2024

సీనియర్ విద్యార్థిపై దాడికి పాల్పడిన ఇద్దురు విద్యార్థుల సస్పెండ్

- Advertisement -
- Advertisement -

కొండపాక: వెలికట్ట శివారులోని శ్రీకృప ఫార్మసి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు గొడవపడిన విషయంలో దాడికి పాల్పడిన ఇద్దరిని సస్పెండ్ చేస్తూ కళాశాల ప్రిన్సిపాల్ నోటిసు అందజేశారు. ఫార్మసి చదువుతున్న సీనియర్ విద్యార్థి సమీర్‌ను జూనియర్ విద్యార్థులు మంగళవారం దాడి చేసి చితకబాదిన సంఘటన తెలిసిందే. ఈ విషయంలో ప్రిన్సిపాల్ దాడికి పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినప్పటికి బుధవారం ఎవరూ రాకపోవడంతో దాడికి పాల్పడిన అదిత్యవర్ధన్‌రెడ్డి, ఇదాయత్ అలీ అనే ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ మంజు నాథ్ తెలిపారు. కళాశాల క్రమశిక్షణ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు తరగతులకు ల్యాబ్‌లకు హాజరు కావద్దని తెలిపారు. ఈ విషయంలో కుకునూరుపల్లి పోలీస్ స్టేసన్‌లో ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News