Saturday, November 16, 2024

కరోనాతో ఖాళీ అయిన హాస్టల్స్

- Advertisement -
- Advertisement -

Students vacate hostels with COVID-19 effect

బంద్‌తో బడులు మూత
పల్లెలకు తరలివెళ్లిన విద్యార్థులు

గద్వాల: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యాలయాలు మూసి వేస్తున్నట్లు తెలియని విద్యార్థులు ఆయా పాఠశాలలు, కళాశాలలకు చేరుకుని, తిరిగి వెళ్లిపోయారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అన్ని గురుకుల విద్యాలయాలు, వసతీ గృహాలు, పలు హాస్టల్స్ మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ హాస్టల్స్ నుండి విద్యార్థులు ఖాళీ చేసి తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. మంగళవారం వరకు జిల్లాలో విద్యాసంస్థలు నడుస్తుండటంతో… విద్యార్థుల రాకపోకలతో ఆయా పట్టణాలలో విద్యాసంస్థలు కళకళాడుతుండేది. బుధవారం నుంచి విద్యాలయాలు మూసి వేయాలంటూ ప్రకటనలు రావడంతో విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో విద్యా సంస్థలలో, పలు హాస్టల్స్ విద్యార్థులు లేక ఒక్క సారి మూగబోయింది.

వసతీ గృహాలకు విద్యార్థుల తల్లిదండ్రలు చేరుకుని తమ పిల్లలను తమ గ్రామానికి తీసుకెళ్లారు. విద్యాభోదన సామాగ్రి, నిత్యావసర సామాగ్రిని పెట్టెలలో సర్దుకుని తమ గ్రామాలకు వెళ్లారు. మళ్లీ ఎప్పుడు బడులు తెరుస్తారో స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు విద్యాలయాలకు రావదంటూ ప్రదానోపాద్యాయులు, ఉపాద్యాయులు, హస్టల్స్ వార్డెన్లు విజ్ఞప్తి చేశారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని కాని విద్యార్థులు ఇంటి వద్ద ఉండి ఆన్‌లైన్‌లో తరగతులు విన్నే సౌకర్యాలు లేకపోవడం, ఒక వేళ విన్నా కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోన మహమ్మారి పూర్తిగా నియంత్రించి త్వరగా విద్యాసంస్థలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.

లాక్ డౌన్ భయంతో సొంతూళ్లకు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంస్థల మూసి వేతకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండు విద్యార్థులతో కిటకిటలాడింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు, లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలి. ఒక్క సారిగా విద్యాసంస్థలు మూసివేయాలంటూ ఆదేశాలు జారీ కావడంతో విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేసి తమ సొంత ఊర్లకు బయలు దేరారు. కొందరు ఆర్టీసీ బస్సులలో, మరి కొందరు ప్రైవేటు వాహనాలలో తమ సొంతూళ్లకు బయలు దేరారు. జిల్లా కేంద్రంలో ఏ రోడ్డు మీద చూసిన, ఏ వాహనం చూసిన విద్యార్థుల రద్దీ కనిపించింది. మళ్లీ విద్యా సంస్థలు ఎప్పుడు తెరుస్తారో అని విద్యార్థులు ఆందోళనతో తమ ఊర్లకు బయలుదేరారు. గ్రామాలలో సైతం లాక్‌డౌన్ వదంతులు వ్యాపిస్తుండటంతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News