Tuesday, January 7, 2025

మధ్యాహ్న భోజనం పెట్టలేదని స్కూలును ధ్వంసం చేసిన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

Students Vandalise School In Bihar Katihar

 

పాట్నా: బీహార్ లోని కతిహార్ జిల్లా బార్సోయి బ్లాక్ అబాద్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధి లోని బరియాల్ అప్‌గ్రేడ్ మిడిల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని, టీచర్లు పాఠాలు చెప్పకుండా మసాజ్ చేయమంటున్నారని ఆరోపిస్తూ పాఠశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విద్యార్థులను గ్రామస్తులే రెచ్చగొట్టారని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. కాగా, ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. విచారణకు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News