Saturday, January 25, 2025

తరగతిగదిలో ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధించిన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్య నేర్పించే గురువులను దైవ సమానులుగా చూడాల్సిన విద్యార్థులు, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విద్యా విలువలు మంటకలిసేలా చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్‌ లో ఓ పాఠశాలలో ముగ్గురు మైనర్‌ విద్యార్థులు మహిళా ఉపాధ్యాయురాలి పట్ల పశువుల్లా ప్రవర్తించారు. తరగతిగదిలో ఉపాధ్యాయురాలి ఎదుట అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. వెకిలి మాటలు, వెకిలి చేష్టలతో కామ పిశాచాల్లా వ్యవహరించారు. తరగతిగదిలోనే ఉపాధ్యాయురాలుకు అసభ్యకరంగా సైగలు చేస్తూ రెచ్చిపోయారు. అంతటితో ఆగని ఆ నీచులు మేడమ్‌, ఐ లవ్‌ యూ అంటూ డైరెక్టుగా తరగతిగదిలోనే ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

తరగతిగది బయటకు వెళ్లిన తర్వాత కూడా ఉపాధ్యాయురాలి వెంట పడ్డ ముగ్గురు ఆకతాయి విద్యార్థులు అక్కడ కూడా లవ్‌ యూ మేడం, ఓసారి చూడండి మేడం అంటూ ఉపాధ్యాయురాలును అత్యంత దారుణంగా వేధించారు. కొంతమంది విద్యార్థినులు కూడా ఈ కామ పిశాచాల అల్లరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడం మరో విషాదం. వాళ్ల వెకిలి కామెంట్లు, చేష్టలు మానకపోవడంతో సహనం కోల్పోయిన ఆమె తరగతిగది నుంచి వెళ్లిపోయారు. అప్పుడు కూడా ఆ ముగ్గురు విద్యార్థులు ఆమెను వెంబడించి వేధించారు. సహనం కోల్పోయిన ఆ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు మైనర్‌ విద్యార్థులు తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని మహిళా ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ మైనర్‌ విద్యార్థులపై కేసు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News