మన తెలంగాణ/మోత్కూరు: స్టాండర్డ్ షిటూరియో ఇంటర్నేషనల్ కరాటే డు ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మోత్కూరు విద్యార్థులు ప్రతిభ కనబర్చి మెడల్స్ సాధించినట్టు కరాటే కోచ్ అన్నెపు వెంకట్ సోమవారం విలేకరులకు తెలిపారు. భువనగిరిలోని గౌరీ మనోహర్ ఫంక్షన్ హాల్‌లో జాతీయ స్థాయి కరాటే పోటీలను నిర్వహించారు. పోటీల్లో బ్లాక్ బెల్ట్ అమ్మాయిల కటా విభాగంలో ఎం.సిరివెన్నెల గోల్డ్, సిహెచ్.వీణా సిల్వర్, బి.రేణుశ్రీ బ్రాంజ్, బాలుర విభాగంలో జె.శివకుమార్ గోల్డ్, ఎం.సాయికుమార్ సిల్వర్, బి.శ్రీమాన్ బ్రాంజ్, బ్రౌన్ బెల్ట్ కటా విభాగంలో ఎన్.సాక్షి గోల్డ్, ఎం.విమలశ్రీ సిల్వర్, ఎం.అధ్వైత బ్రాంజ్,
బ్లూ బెల్ట్ కటా విభాగంలో ఎన్.వైష్ణవి సిల్వర్, ఆర్.యశశ్రీ బ్రాంజ్, గ్రీన్ బెల్ట్ విభాగంలో ఎన్.సోనాక్షి గోల్డ్, బి.మధుశ్రీ సిల్వర్, ఆరెంజ్ బెల్ట్ విభాగంలో బి.శ్రీరామ్ గోల్డ్, ఎ.శ్రీయాన్ష్ సిల్వర్, పి.ప్రదీన్ కుమార్ బ్రాంజ్, బ్లూ బెల్ట్ విభాగంలో ఎండి.జోహాన్ సిల్వర్, సాయిసుజిత్ బ్రాంజ్, ఆరెంజ్ బెల్ట్ కటా విభాగంలో ఎం.హర్షవర్ధన్ గోల్డ్, అంజిత్ సిల్వర్, బి.అక్షయ్ బ్రాంజ్, ఎల్లో బెల్ట్ విభాగంలో ఎన్.సిరి గోల్డ్, డి.తనుశ్రీ, డి.అనుశ్రీ సిల్వర్, పి.అభి సిల్వర్, ఎం.అక్షిత్ సిల్వర్, బి.మధుశ్రీ బ్రాంజ్ మెడల్స్ సాధించారని తెలిపారు. స్పారింగ్‌లో బ్రౌన్ బెల్ట్‌లో కె.శివకృష్ణ సిల్వర్, ఎం.హర్షవర్ధన్ బ్రాంజ్, బ్లాక్ బెల్ట్‌లో జె.శివకుమార్ గోల్డ్, డి.కృష్ణసాయి సిల్వర్, బ్రౌన్ బెల్ట్‌లో కె.సిరిచందన్ గోల్డ్, కె.నిధి సిల్వర్ మెడల్స్ సాధించారని తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను గ్రాండ్ మాస్టర్ పి.బాలరాజు అభినందించారు.