Wednesday, January 22, 2025

కెనడాలో విదేశీ విద్యార్థుల పనిచేసే సమయంపై నిబంధన

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: కెనడా తమ దేశం కొచ్చి చదువుకునే విద్యార్థులకు కొత్త నిబంధన పెట్టింది. సాధారణంగా విదేశానికి వెళ్లి చదుకునే మధ్య తరగతి విద్యార్థుల తమ ఖర్చులకు గాను పార్ట్ టైమ్ పనిచేసుకుని సంపాదించుకుంటారు. అయితే కెనడా తాజాగా ఆఫ్ క్యాంపస్ లో ఇక నుంచి వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునే నిబంధన పెట్టింది. ఇప్పటి వరకు వారానికి గరిష్ఠంగా 40 గంటలు పనిచేసుకునే వీలుండేది. ట్రూడో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత విద్యార్థులపై ప్రభావం చూపనుంది.

పనిపై పరిమితి విధించడం వల్ల విదేశీ విద్యార్థులు ఉద్యోగం కంటే విద్యపై ఎక్కువ దృష్టి  పెడతారని కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీ, సిటిజెన్ షిప్ వ్యవహారాల శాఖ మంత్రి మార్క్ మిల్లర్ అభిప్రాయపడ్డారు. కెనడాలో సెప్టెంబర్ నుంచి అకాడెమిక్ ఇయర్ మొదలవుతుంది.  2022 గణాంకాల ప్రకారం కెనడాలో 319130 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ట్రూడో తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన భారతీయ విద్యార్థులను చాలా వరకు ఫిల్టర్ చేస్తుందేమో చూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News