Monday, December 23, 2024

హైదరాబాద్‌లో స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:దేశంలోనే అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో (SAFE) మార్చి 12, 2023న హైదరాబాద్‌లోని బేగంపేటలోని పాత విమానాశ్రయం రోడ్డుకు సమీపంలో ఉన్న మనోహర్ హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌ని WeMakeScholars – భారతదేశపు అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ నిర్వహించనుంది, వీరు గత సంవత్సరం (2022)లో రూ.4,200 crores కోట్ల ఎడ్యుకేషన్ లోన్ విద్యార్థులకు అందయించడంలో సహాయపడ్డారు. భారతీయ విద్యార్థులకు విదేశాల్లో తమ చదువులకు ఆర్థిక సహాయం అందించడం వీరి లక్ష్యం. WeMakeScholars అనేది IT మంత్రిత్వ శాఖ, Govt పరిధిలోకి వచ్చే డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా నిధులు, మద్దతు కలిగిన సంస్థ.

WeMakeScholars 7 సంవత్సరాల క్రితం Facebook గ్రూప్ రూపంలో విదేశాలలో చదువుకోవడానికి ప్లాన్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో, అర్జున్ R. కృష్ణ & దామిని మహాజన్ (UK ప్రభుత్వ స్కాలర్‌షిప్ విజేతలు)చే ప్రారంభించబడింది. నేడు, ఇది ఉన్నత విద్య ఫైనాన్స్ పరిశ్రమలో అగ్ర స్థాయిలో ఉంది. వీరు 26,000+ అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లకు యాక్సెస్‌ను అందించే స్కాలర్‌షిప్ పోర్టల్‌ను నిర్మించారు. భారతదేశంలో అతి తక్కువ వడ్డీ రేట్లతో విద్యార్థులకు విద్యా రుణాలను పొందడంలో సహాయపడుతున్నారు, వీరి సేవలు పూర్తిగా ఉచితం.

SAFE 2023లో, విద్యార్థులకు అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ల గురించి తెలుసుకోవడానికి, భారతదేశంలోని అతి తక్కువ వడ్డీ రేట్లతో 14+ బ్యాంకుల నుండి తక్షణ విద్యా రుణం ప్రీ-శాంక్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. డబ్బు కొరత కారణంగా విదేశాల్లో చదువుకోవాలనే తమ కలను ఏ విద్యార్థి రాజీ పడకుండా చూడడమే ఈ ఎక్స్‌పో లక్ష్యం.

ఈ ఈవెంట్‌లో, USA, UK, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇతర యూరోపియన్ దేశాలలో ఈ సంవత్సరం ఫాల్ ఇన్‌టేక్ 2023లో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులు, భవిష్యత్తు ఇన్‌టేక్‌లలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా హాజరు కావాలని తెలుపుతున్నారు. విద్యార్థి ప్రొఫైల్ ను భారతదేశంలోని 14 బ్యాంకుల ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్ ప్రమాణాల ప్రకారం చెక్ చేయబడుతుంది. ఇది వారికి చాలా సహాయకరంగా ఉంటుంది.

SAFE 2023 కొరకు రిజిస్టర్ చేసుకోవడానికి, విద్యార్థులు https://www.wemakescholars.com/study-abroad-funding-expo-safe లింక్ ను విజిట్ చేయండి. మరింత సమాచారం కోసం, www.WeMakeScholars.com వెబ్ సైట్ ను విసిట్ చెయ్యండి. భారతదేశం యొక్క అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పోకు హాజరయ్యే అవకాశాన్ని మిస్ అవ్వకండి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News