Wednesday, January 22, 2025

స్టడీ సర్కిళ్లు యువతకు వరం

- Advertisement -
- Advertisement -

Study circles are boon to the youth

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు బిసి స్టడీ సర్కిళ్లను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్ కోరారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ‘బిసి స్టడీ సర్కిల్ కే్ంరద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుత్న్ను విద్యార్థులతో మాట్లాడి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్‌కుమార్‌తో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఓయూలోని బిసి స్టడీ సర్కిల్ నిర్వహణ తీరు గురించి అధికారులు, విద్యార్థులను ఆయన అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీని సందర్శించారు. అనంతరం కిశోర్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ట్యాగ్ లైన్ అయిన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ను సంపూర్ణం చేసిన మహా నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించిన విద్యార్థులకు రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సిఎం కెసిఆర్ అన్ని రకాలుగా సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో బిసి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉద్యోగాలను సాధించాలన్నారు. రాష్ట్రంలోని 12 బిసి స్టడీ సర్కిళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.24.53 కోట్లను కేటాయించిందన్నారు. అభ్యర్థులకుఅవసరమైన అన్ని రకాల స్టడీ మెటీరియల్ ను అందుబాటులో ఉంచాలని, విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ స్టడీ సర్కిల్ కేంద్రంలో 44 మంది సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని, వారందరికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News