హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) కోసం స్టడీ మెటీరియల్ అందుబాటులో వచ్చింది. ప్రఖ్యాత విద్యావేత్త మొహమ్మద్ ఖాజా ఉర్దూ భాషలో స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచే ప్రయత్నంలో మొత్తం సిలబస్‌ను పది సంపుటాలుగా కవర్ చేశారు. ఆయన కేవలం మెటీరియల్‌ను సంకలనం చేయడమే కాకుండా ఎఐ సాధనాలను ఉపయోగించి మెటీరియల్‌ను ’మాట్లాడే మోడ్’లో కూడా మార్చారు. ఆదిలాబాద్‌కు చెందిన ఖాజా ఉర్దూ-మీడియం నేపథ్యం నుండి వచ్చిన వారి కోసం ప్రత్యేకమైన ఐఎఎస్ స్టడీ సర్కిల్‌ను స్థాపించారు. ఉర్దూలో స్టడీ మెటీరియల్ లేకపోవడం వల్ల, ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకున్న 25 వేల మందిలో 38 మంది అభ్యర్థులు మాత్రమే అక్టోబర్ 2022లో గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించారు.
తెలంగాణ ప్రభుత్వం ఉర్దూను రెండవ రాష్ట్ర భాషగా ప్రకటించినప్పటి నుండి, ఖాజా ఉర్దూలో స్టడీ మెటీరియల్‌ను సంకలనం చేసే చొరవను చేపట్టారు. టిఎస్‌పిఎస్‌సి సిలబస్‌తో పాటు, ఖాజా ఉర్దూ భాషలలో తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం కోసం ‘బిట్ బ్యాంక్’ను కూడా సంకలనం చేశారు. విద్యార్థుల కోసం 2021 నుంచి స్టడీ మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇంగ్లీషు, ఉర్దూ మీడియం సిలబస్‌ల కోసం ఎఐ- పవర్డ్ ’స్పీకింగ్’ మాడ్యూల్ ఆలోచన ప్రిపరేషన్‌ను సులభతరం చేస్తుందని ఖాజా చెప్పారు. ‘బిట్ బ్యాంక్’లో భారతీయ చరిత్ర, భారత రాజ్యాంగం, భారత భూగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తెలంగాణ భౌగోళికం, జీవ శాస్త్రాలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జూన్ 2023 వరకు నవీకరించబడిన కరెంట్ అఫైర్స్ వంటి అంశాలు ఉన్నాయి.