Monday, December 23, 2024

నిజాం షుగర్ ఫ్యాక్టరీలపై అధ్యయనం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మూతపడ్డ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల పునరుద్ధరణపై సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష ని ర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసివేయబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని సిఎం ఆదేశించారు. బోధన్, ముత్యంపేటలలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై ఈ కమిటీతో సిఎం చ ర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ప్రస్తుతం సాధక బాధల గురించి సి ఎం అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు ఫ్యాక్టరీ భూముల పరిరక్షణ, యంత్రాల నష్టం, వాటిని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన బడ్జెట్‌పై నివేదిక ఇవ్వాలని సిఎం అధికారులను ఆదేశించా రు. ఈ ఫ్యాక్టరీలు నష్టం రావడానికి కారణాలను అధ్యయనం చేయాలని, వాటి పరిష్కారానికి సరైన మార్గాలను అన్వేషించాలని ఈ సందర్భంగా కమిటీని ఆదేశించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగిన సలహాలు, సూచనలను అందించాలని సిఎం రేవంత్ రెడ్డి ఈ కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని సిఎం ఆ దేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సిఎం కమిటీకి సూచించారు.
మూతబడిన మూడు యూనిట్లు
ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద నిజాం షుగర్స్ పరిశ్రమలో మూడు యూనిట్లు మూతపడ్డాయి. దీనిని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 1983లో మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ నిర్మించారు. 2002లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 51 శాతం వాటాలను డెక్కన్ పేపర్స్ లిమిటెట్‌కు విక్రయించింది. దీంతో ఎన్‌ఎస్డీఎల్(నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్)గా మార్చారు. 2014లో బిఆర్‌ఎస్ (అప్పటి టిఆర్‌ఎస్) ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగుతున్న పరిశ్రమను సహకార సంఘంగా కొనసాగించాలని 2015లో గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్యాక్టరీ ఆర్థికంగా లాభదాయకంగా లేనందున ప్రభుత్వం దానిని నడపలేమని మాజీ సిఎం కెసిఆర్ గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. దీంతో 2017లో ప్రైవేట్ మేనేజ్‌మెంట్ లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఇది మూడు యూనిట్లను మూసివేయడానికి దారితీసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News