Wednesday, January 22, 2025

స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కన్యాకుమారి : తెలుగు, తమిళ సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా పనిచేసే కనల్ కన్నన్‌ను తమిళనాడు లోని కన్యాకుమారిలో పోలీస్‌లు అరెస్టు చేశారు. క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఓ వీడియో తన ట్విటర్ ద్వారా పోస్టు చేయడమే అరెస్టుకు కారణం. డిఎంకె ఐటి విభాగం డిప్యూటీ ఆర్గనైజర్ ఆస్టిన్ బెన్నెట్ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీస్‌లు కేసు నమోదు చేసి అరెస్ట చేశారు. మొదట సోమవారం కన్నన్‌ను కొన్ని గంటల పాటు విచారించారు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు అరెస్టు చేశారు. ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోని గత నెల 18న తన ట్విటర్‌లో కన్నన్ పోస్ట్ చేశాడు. గతం లోనూ సామాజిక ఉద్యమ నేత పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కన్నన్ జైలు పాలయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News