Monday, January 13, 2025

రూ.75000 లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని కడిమ్ జల్నా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ఎసిబి వలకు చిక్కారు. ఎస్‌ఐ 75000 రూపాయల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. గణేష్ షిండే (35) అనే పోలీస్ కడిమ్ జల్నా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఓ కేసు విషయంలో ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్‌ఐ షిండే తన దగ్గరకు వచ్చిన బాధితుడిని డిమాండ్ చేశాడు. బాధితుడు రూ.75000 ఇస్తానని మాట ఇచ్చాడు. వెంటనే వెళ్లి ఎసిబి అధికారులను కలిసి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఎస్‌ఐ గణేష్ రూ.75000 తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకోవడంతో డబ్బులు విసిరేసి కారులో ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నాడు. ఎసిబి అధికారులు అతడి కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న రూ9.41 లక్షలు, 29 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా సదరు ఎస్‌ఐ అవినీతి పాల్పడినట్టు ఎసిబి అధికారులు గుర్తించారు.

Read Also: జూ. ఎన్‌టిఆర్ సిఎం సిఎం అంటూ నినాదాలు… బాబు అసహనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News