Tuesday, January 21, 2025

పేపర్ లీకేజీ…. అన్నాచెల్లెలకు ఎస్ఐ ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లో అన్నాచెల్లెలు పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పేపర్ లీకేజీతో అన్నాచెల్లెలు ఎస్‌ఐ పరీక్షల్లో ఉత్తీర్ణతీ సాధించారు. 2021లో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షల్లో శోభా రైకా స్టేట్ ఐదో ర్యాంకు సాధించారు. ట్రైనింగ్ సమయంలో ఆమె ప్రతిభ చూపించకపోవడంతో అధికారులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. శోభాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె తండ్రి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. గతంలో శోభా సోదరుడు ఎస్‌ఐ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. శిక్షణలో పెద్దగా రాణించకపోవడంతో అప్పుడు కూడా పేపర్ లీకై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు.  గతంలో ఎస్ఐ పేపర్ లీకేజీ వ్యవహారంలో 66 మంది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టైన వారిలో 33 మంది అభ్యర్థులు ఎస్ఐ ట్రైనింగ్ తీసుకుంటుండగా నలుగురు అభ్యర్థులు మాత్రం వివిధ స్టేషన్లలో ఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News