Thursday, December 26, 2024

మతిస్థిమితం లేని యువతిని కాపాడిన ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర వైయస్సార్ సర్కిల్ ట్రెండ్స్ ఎదురుగా రాత్రి రెండు గంటల సమయంలో మతిస్థిమితం లేని యువతి రైలు దిగి ఎటు వెళ్ళాలో తెలియక రోడ్డుపై కూర్చోవడంతో అర్థరాత్రి 2 గంటల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మధిర టౌన్ ఎస్‌ఐ రాజేష్ ఆమె దయనీయ పరిస్థితి గమనించి ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి సుదర్శన్ సహకారంతో అనాధ ఆశ్రమానికి తరలించి తదుపరి తమ బంధువుల ఆచూకీ తెలుసుకొని వారికి సమాచారం అందించి వారి తల్లిదండ్రులకు గుర్రం సునీత 25 అనే యువతిని అప్పగించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మతిస్థిమితం లేక భర్త పాపను వదిలి నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన సునీత ఆచూకీ తెలియజేయడంతో సంతోషంతో యువతిని హక్కున చేర్చుకోవడంతో పలువురికి కంటతడి పెట్టించింది. అత్యంత దుర్భర పరిస్థితులలో రోడ్డుపై దయనీస్థితిలో కనపడిన యువతి సునీతను అత్యంత బాధ్యతతో ఆర్కే ఫౌండేషన్ వారికి అప్పగించి తదుపరి వారి బంధువులకు కూడా సమాచారం అందించడంతో మధిర పట్టణ ప్రజలు మధిర టౌన్ ఎస్సై రాజేష్ ని మరియు ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి సుదర్శన్ లను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News