- Advertisement -
మనతెలంగాణ, సిటిబ్యూరోః రిజిస్ట్రేషన్ చేసేందుకు డబ్బులు తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు. దూద్‌బౌలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్ అమైర్ ఫరాజ్ ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తి గోపీ సింగ్ ద్వారా రూ.2లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
శాలీబండకు చెందిన సయిద్ షాహబాజ్‌కు చెందిన రెండు సేల్‌డీడ్స్ తన పేరుపై చేసేందుకు సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించాడు. దీనికి రూ.2లక్షలు ఇవ్వాలని లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు. ఎసిబి అధికారుల సమాచారం మేరకు బాధితుడు డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఎసిబి కోర్టు హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -