Thursday, January 23, 2025

సీనియర్ నటి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ నటిమణి ఆర్ సుబ్బ లక్ష్మి కన్నుమూశారు. 87 ఏళ్ల వయసు పైబడడంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారని ఆమె మనవరాలు సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. “నా బలం మా అమ్మమ్మను కోల్పోయానని” అంటూ ఎమోషనల్‌గా పోస్టు చేశారు. సినీ ప్రముఖులు ఆమెపై మృతిపట్ల సంతాపం తెలిపారు. దీంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. బుల్లితెర, వెండితెరపై నటించడంతో పాటు డబ్బింగ్ ఆర్టిస్టు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఆమె 70 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో ఏ మాయ చేసావె, కళ్యాణ రాముడులో నటించారు. చివరిసారిగా విజయ్ హీరోగా తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమాలో సుబ్బలక్ష్మి నటించారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు జవహర్ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా సేవలందించారు. 1951లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగినిగా పని చేశారు. సౌత్ ఇండియా నుంచి ఆల్ ఇండియా రేడియోలో పని చేసిన తొలి లేడీ కంపోజర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News