హైదరాబాద్: తెలంగాణ పోలీసుల సుబ్బారావు అదుపులో తీసుకున్నారు. పక్కా ప్లాన్ తో సుబ్బారావు విద్యార్థులను రెచ్చగొట్టారు. ఎపి, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది బ్రాంచ్ లు నడిపిస్తున్నారు. ఆర్మీ కోచింగ్ సెంటర్ పేరుతో 2 లక్షలు ఫీజు సుబ్బారావు తీసుకుంటున్నాడు. అభ్యర్ధులు తన అకాడమీలో చేరాలని విడతల వారిగా డబ్బుల చెల్లించాలని ఒప్పందం చేసుకున్నాడు. తన వద్ద శిక్షణ తీసుకుంటే ఎంపిక గ్యారెంటీ అని హామీలు ఇచ్చాడు. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలు అని అభ్యర్థులను ఆకర్షించాడు. ఆర్మీకి సెలెక్ట్ ఐనా తర్వాత మిగతా మొత్తం చెల్లించేలా అభ్యర్ధులను ఒప్పించాడు.
గ్యారెంటీ కింద అభ్యర్థులకు చెందిన 10వ తరగతి మెమోలు తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పటికే అభ్యర్థులు ప్రాథమిక పరీక్ష పూర్తి చేసుకున్నారు. ప్రాథమిక పరీక్ష పూర్తి చేసుకున్న ఎగ్జామ్ క్లియర్ చేస్తే అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో సుబ్బారావుకు ఫీజులు వసూలు అవుతాయి. రాత పరీక్ష లేదని ప్రభుత్వం అగ్నిపథ్ ప్రకటించడంతో 50 కోట్లు నష్టపోతానని గ్రహించాడు. ఎలా అయిన అభ్యర్థులను రెచ్చగొట్టి రాత పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్లాన్ వేశాడు.
పల్నాడు జిల్లా రావిపాడు పంచాయితీ పరిధిలోని బైపాస్ రోడ్డులో సాయి అకాడమీ మెయిన్ బ్రాంచ్ ఉంది. మూడు రోజుల పాటు సాయి డిఫెన్స్ అకాడమీ లో ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో హార్డ్ డిస్క్ లతో పాటు అనేక మంది అభ్యర్థుల 10వ తరగతి మెమోలను స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజులగా సుబ్బారావును ఐటి అధికారులు విచారిస్తున్నారు. నిన్న విచారణ ముగియడంతో సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.