Wednesday, January 22, 2025

జూ.ఎన్టీఆర్ ప్రత్యేకత అది: శుభలేక సుధాకర్

- Advertisement -
- Advertisement -

చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్,  ఆయనతో కలిసి పనిచేసిన హీరోయిన్స్, ఆయన స్పీడ్ ను అందుకోవడం తమ వల్ల కాలేదనే చెబుతుంటారు. కొరియోగ్రఫర్ చెప్పిన మూమెంట్స్ ను తాము ప్రాక్టీస్ చేస్తాముగానీ, ఎన్టీఆర్ నేరుగానే టేక్ చేస్తుంటారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు.

తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి శుభలేఖ సుధాకర్ ప్రస్తావించారు. ‘‘ఎన్టీఆర్ తో కలిసి ‘అరవింద సమేత’ చేశాను. సెట్లో ఆయన చాలా సరదాగా, కలివిడిగా ఉంటారు. షాట్ రెడీ అనగానే కెమెరా ముందుకు వెళతారు. ఇక అప్పుడు ఆయనను పట్టుకోవడం కష్టమే” అన్నారు.

‘‘ సీన్ ఏదైనా ఎన్టీఆర్ ఎదురుగా ఉన్న ఆర్టిస్టులకు టేకులు కావాలేమోగానీ, తాను మాత్రం సింగిల్ టేక్ తో ముగించేస్తారు. సెట్లో ఆయన స్క్రిప్ట్ చూసుకోవడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. కానీ ఎన్ని పేజీల డైలాగ్స్ అయినా సింగిల్ టేక్ లో చెప్పేవారు. ఆయనలోని కసిని, కృషిని దగ్గరగా చూసినవారిలో నేను ఒకడిని’’ అని చెప్పుకొచ్చారు సుధాకర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News