Monday, January 20, 2025

భార్యాబిడ్డలను ఉరితీసిన తరువాత ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

జెమ్‌షెడ్‌పూర్ : ఝార్ఖండ్ లోని కొక్మార గ్రామంలో శుక్రవారం రాత్రి 29 ఏళ్ల సుభేందు బెరా అనే వ్యక్తి తన భార్యను, మూడేళ్ల కొడుకును ఉరితీయడమే కాక, తాను కూడా చెట్టుకు ఉరిపోసుకోడానికి ప్రయత్నించాడు. జెంషెడ్‌పూర్‌కు 90 కిమీ దూరంలో ఈ సంఘటన జరిగింది. నిందితుని మానసిక పరిస్థితి బాగోలేక పోవడంతో పోలీస్‌లు చికిత్స కోసం రాంచీ ఆస్పత్రిలో చేర్చారు.

శుక్రవారం రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత నిందితుడు సుభేందు బెరా ఇంటిలో స్వల్ప వివాదం కారణంగా తన భార్య పార్వతిబెరా( 25)తో గొడవ పడి భార్యతోపాటు మూడేళ్ల కుమారుడిని ఇంటిలో ఉరితీసి హత్యకు పాల్పడ్డాడని బహరాగొర పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌ఛార్జి సంతన్ తివారీ చెప్పారు. ఇంట్లో అలజడి, ఏడుపులతో మిగతా కుటుంబీకులు లేచి నిందితుడు ఆత్మహత్యకు ప్రయత్నించడాన్ని అడ్డుకున్నారు. గ్రామస్తులు నిందితుడిని చెట్టు పై నుంచి కిందకు దించి పోలీస్‌లకు అప్పగించారు. మృతదేహాలను పోస్ట్ మార్టమ్‌కు పోలీస్‌లు పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News