- Advertisement -
ముంబై: స్కోర్పెన్ రకం సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ కరంజ్‌ను ముంబై లోని భారత నేవీ లోకి బుధవారం చేర్చారు. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (సిఎన్ఎస్)అడ్మిరల్ కరంబీర్ సింగ్ , అడ్మిరల్ (రిటైర్డ్) విజయ్‌సింగ్ షెకావత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. భారత్‌లో తయారీ కార్యక్రమం కింద మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ ఈ సబ్‌మెరైన్‌ను నిర్మించింది. అదే షిప్‌యార్డు నుంచి ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ ఖండేరీ అనే సబ్మెరైన్లను భారత నేవీ ఇదివరకే చేర్చుకుంది. గత ఏడు దశాబ్దాలుగా భారత నేవీ స్వదేశీ తయారీలోను, రక్షణ లో స్వావలంబన లోను పటిష్టంగా ఉంటోందని అడ్మిరల్ కరంబీర్ సింగ్ వెల్లడించారు.
- Advertisement -