Thursday, January 23, 2025

అద్దె వాహనాల పెండింగ్ బిల్లులు ఇప్పించండి 

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా ఓపెన్‌కాస్టులకై భూములు ఇచ్చిన భూనిర్వాసితులకు యాజమాన్యం అద్దె ప్రాతిపదికన వాహనాలను కేటాయించింది. ప్రభావిత గ్రామాల్లోని నిరుద్యోగులకు పరోక్షంగా ఉపాధి కల్పించే విధంగా వాహనాలను అద్దెకు తీసుకుంది.

డ్రైవర్ జీతం, మెయింటనెన్స్, ఇఎంఐలు, డీజిల్, వాహనాల రేట్లు పెరగడం వల్ల 2017 రేట్లను చెల్లిస్తున్నందున పెద్ద ఎత్తున నష్టపోతున్నామని బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధుకర్‌కు యజమానులు వినతిపత్రం సమర్పించారు. సిఎంపిఎఫ్ యాజమాన్యానిదే బాద్యత, యూనిట్ రేటు వేరియేషన్ విధానం ఉండాలని, అద్దె రేట్లు పెంచాలని, 12 గంటల వాహనాలు రద్దు చేసి 8 కానీ 16 గంటలు ఇవ్వాలని చైర్మెన్ దృష్టికి తీసుకెళ్లారు.

తమ సమస్యలను కార్పోరేట్ పర్సనల్ జిఎంకు విన్నవించామని, సెప్టెంబర్ వరకు సమయం కావాలని కోరారన్నారు. కానీ నెల నెల బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. ఎలాంటి రికవరీ లేకుండా పెండింగ్ బిల్లులు ఇప్పించే విధంగా యాజమాన్యంతో మాట్లాడాలని చైర్మెన్‌కు మొరపెట్టుకున్నారు. వాహనాల యజమానుల సంఘ అధ్యక్షులు సుందిల్ల నాగరాజు, తోట సమ్మయ్య, తదితరులు పాల్గోన్నారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని వచ్చిన సందర్భంగా చైర్మెన్‌ను భూనిర్వాసితుల వాహనాల ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News