Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్‌తో భేటీ అయిన సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి

- Advertisement -
- Advertisement -

Subramanian Swamy meets CM KCR

న్యూఢిల్లీ: ఢిల్లీలో పర్యటనలో ఉన్న తెలంగాణ సిఎం కెసిఆర్ తో బిజెపి రాజ్యసభ సభ్యులు సుబ్రమణియన్ స్వామి గురువారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు, భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. కెసిఆర్‌తో క‌లిసి సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి లంచ్ చేశారు. వారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి, కాంగ్రెసేత‌ర పార్టీల‌తో జాతీయ స్థాయి కూట‌మిని ఏర్పాటు చేసేందుకు పలు పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్నారు. ఇటీవ‌ల ఆయన మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ థాక‌రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో స‌మావేశ‌మై జాతీయ రాజ‌కీయాల‌పై చర్చించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News