Thursday, January 23, 2025

సైబరాబాద్‌లో ‘అంగడి’ పోలీస్ సబ్సిడీ క్యాంటీన్..

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరోః పోలీసులు క్యాంటిన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ అన్నారు.
కమీషనరేట్ పునర్మించిన అంగడి సైబరాబాద్ వెల్ఫేర్ పోలీసు సొసైటీ క్యాంటిన్‌ను శనివారం తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటిన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది కుటుంబ అవసరాల నిమిత్తం నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి 25 నుంచి 30% మేర సబ్సిడీకి లభిస్తాయన్నారు.

సుమారు 1000 రకాల వస్తువులు దొరికే ఈ అంగడి పోలీసు క్యాంటిన్ ఒక మినీ సూపర్ మార్కెట్ అన్నారు. అంగడి క్యాంటిన్ ఏర్పాటుకు కృషి చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టిఫెన్ రవీంద్రను అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, డిసిపి క్రైమ్స్ కల్మేశ్వర్ సింగన్వార్ , డిసిపి అడ్మిన్ యోగేష్ గౌతమ్, డిసిపి షీ టీమ్స్ దీప్తి పంత్, డిసిపి ట్రాఫిక్ హర్షవర్ధన్, సైబర్ క్రైమ్ డిసిపి రితిరాజ్, లా అండ్ ఆర్డర్ డిసిపిలు మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, రాజేంద్రనగర్ డిసిపి శ్రీ జగదీశ్వర్ రెడ్డి, బాలనగర్ డిసిపి శ్రీనివాసరావు,

మేడ్చల్ డిసిపి శ్రీ సందీప్, ఏడిసిపి రాజేంద్రనగర్ రష్మి పెరుమాళ్, సిఎస్‌డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు కృష్ణ, మట్టయ్య, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, ఇన్స్‌స్పెక్టర్ల్లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News