Thursday, November 21, 2024

ఆయిల్ పామ్‌కు కేంద్రం ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

Subsidy of Rs.29 thousand per hectare for oil palm

హెక్టారుకు రూ.29వేల సబ్సిడీ
రూ.11,040కోట్లతో ప్యాకేజీ

కేంద్ర మంతివర్గం నిర్ణయం

మన తెలంగాణ/న్యూఢిల్లీ/హైదరాబాద్ : వంటనూనెల్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. రానున్న ఐదేళ్లలో దేశంలో ఆయిల్‌పామ్ సాగును విస్తృతం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పామ్ పథకం కింద రూ.11,040కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మీడియాకు వివరించారు.

వంటనూనెల కోసం విదేశాలపై భారీగా ఆధారపడటం తగ్గించి, దేశీయంగా నూనెగింజ పంటల సాగును పెంచి తద్వారా వంటనూనెల ఉత్పత్తిని పెంచాలన్న ఉద్దేశంతో ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందుకోసం రాబోయే ఐదేళ్లలో రూ.11,040కోట్లు ఖర్చు చే యనున్నట్లు తెలిపారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ పథకం కింద ఆయిల్ పామ్ సాగుదారులకు గిట్టుబాటు ధరకు హామీ ఇస్తున్నట్టు కేంద్రమంత్రి తోమర్ వెల్లడించా రు. ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగుదారులకు హెక్టారుకు ఇస్తు న్న సబ్సిడీని రూ.12వేలనుంచి రూ.29వేలకు పెంచుతున్నట్టు వివరించారు. అలాగే 15హెక్టార్లకు , కోటి రూపాయల వరకూ సాయం అందించనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఈశాన్య ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ కార్పోరేషన్ పునరుజ్జీవానికి రూ.77కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు.

ఆయిల్ పామ్‌లో తెలంగాణకు అగ్రస్థానం

వంటనూనెల దిగుమతిని తగ్గించి దేశీయంగా పామాయిల్ ఉత్పత్తని పెంచాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణ యం ఇప్పటికే ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టింది.దేశంలో ఇప్పటివరకూ 29.7లక్షల హెక్టార్లు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్టు కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ పంట సాగు పరంగా చూస్తే దేశంలో ఇప్పటివరకూ 3.3లక్షల హె క్టార్లలో మాత్రమే ఆయిల్ పామ్ తోటలు సాగులో ఉన్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ఈ పంట సాగుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టింది.రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ఇక్కడి వాతావరణ పరిస్థితుల అనుకూలతతోపాటు, ఇక్కడి నేలలు కూడా ఎంతో అనుకూలంగా ఉండి సగటు నూనెదిగుబడి కూడా మిగతా ప్రాంతాలకంటే అధికంగా లభిస్తుందని గుర్తించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలను 20లక్షల ఎకరాల్లో సాగు చేయాలని గత ఏడాది కిందటే ప్రణాళికలు సిద్దం చేసి కార్యాచరణ దిశగా చర్యలు చేపట్టింది.

పంట దిగుబడి కూడా 25ఏళ్లనుంచి 30ఏళ్ల పాటు లభిస్తుండటంతో దీర్గకాలిక పంటగానే కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కవ ఆదాయం సమకూరే లాభసాటి పంటగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రలో ఆయిల్ పామ్ సాగును ప్రొత్సహిస్తున్నారు.కేంద్రప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధికారుల బృందం ద్వారా తెలంగాణ రాష్ట్రమంతటా సర్వేలు చేయించింది. 25జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు నివేదిక ద్వారా వెల్లడించింది. ఎంపిక చేసిన 25జిల్లాల్లో 8.14లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతి కూడా ఇచ్చింది.అంతకు ముందు మరో 1.50లక్షల ఎకరాల్లో సాగుకు అనుమతించింది.దీంతో కేంద్రం ద్వారా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 10లక్షల ఎకరాల మేరకు ఈ పంట సాగుకు అధికారింగా అన్ని అనుమతులు లభించాయి. ఎంపిక చేసిన జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు విత్తన మొలకల సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఏజెన్సీల ద్వారా పంట బైబ్యాక్ విధానాలను కూడా ఎంపిక చేసింది. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రివర్గం ప్రధాని మోడి అధ్యక్షత ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సాహానికి తీసుకున్న నిర్ణయం , రూ.11,040కోట్లు కేటాయిస్తు ప్యాకేజికి ఆమోదముద్ర వేయటం ఈ పంట సాగుదారులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది.

ఒపిడిపిఏ హర్షం 

వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించేదిశగా కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల జాతీయ ఆయిల్ పామ్ డెవలపర్స్ , ప్రాసెసర్స్ అసోసియేషన్ (ఒపిడిపిఎ) అధ్యక్షుడు సంజయ్ గోయెంకా హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.దేశంలో ఏటా 22మిలియన్ టన్నుల వంటనూనెల వినియోగం ఉండగా అందులో 15మిలియన్ టన్నుల నూనెలు విదేశాలనుంచే దిగుమతి అవుతున్నట్టు తెలిపారు.విదేశీ దిగుమతులును తగ్గిస్తూ దేశంలోనే నూనెగింజల పంట సాగుకు చర్యలు తీసుకోవటం, ప్రత్యేకించి ఆయిల్ పామ్ సాగునుప్రోత్సహిస్తూ రూ.11,040కోట్లతో ప్యాకేజి ప్రకటించటం పట్ల ప్రధాని నరేంద్రమోడికి అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ గోయెంకా ధన్యవాదాలు తెలిపారు.

ఈశాన్య వ్యవసాయ మార్కెటింగ్ పునరుద్ధరణ

ఈశాన్య ప్రాంత మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఎన్‌ఇఆర్‌ఎఎంఎసి) పునరుద్ధరణక కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పరిశీలించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతిని ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో సంబంధిత కమిటీ సిఫార్సునకు అనుమతిని ఇచ్చినట్లు సమాచార ప్రసారాల మంత్రి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News