- Advertisement -
కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుండి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై సబ్సిడీని రూ.15,000 నుండి రూ.10,000 కి తగ్గించింది. ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 40 శాతం గరిష్ఠ సబ్సిడీ పరిమితి కూడా 15 శాతానికి తగ్గించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం సబ్సిడీ నిధి ముగియనున్నందున ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
మొత్తం బడ్జెట్‌లో 80 శాతం 10 లక్షల మందికి కేటాయించారు. ప్రస్తుతం ఒక్కో ద్విచక్ర వాహనానికి రూ.17,000 నుంచి రూ.66,000 వరకు రాయితీలు విద్యుత్ వాహన తయారీదారులకు ఇస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ తర్వాత ఇది తగ్గనుంది. ప్రారంభించే సమయంలో ఎఫ్‌ఎఎం-2 కింద రూ. 10,000 కెడబ్లుహెచ్ ఇవ్వగా, తర్వాత దాన్ని రూ.15 వేలకు పెంచారు.
- Advertisement -