Monday, January 20, 2025

సబ్‌వే మెనూలో టమాటా తొలగింపు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మెక్‌డోనాల్డ్ తర్వాత ఇప్పుడు మరో ఫాస్ట్‌ఫుడ్ సంస్థ సబ్‌వే భారత్‌లో టమాటాలను దూరం పెట్టింది. రోజు రోజుకీ పెరుగుతూ ఉన్న టమాటా ధరలతో పలు ఫుడ్ తయారీ సంస్థలు వీటిని మెనూ నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కంపెనీ సబ్‌వే కూడా తన అవుట్‌లెట్‌ల నుండి టమాటాలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. సబ్‌వే ఇండియా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని ఒక టెర్మినల్ లో నోటీసు ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

టమాటాలు అందుబాటులో లేకపోవడం తాత్కాలికమేనని, వీలైనంత త్వరగా ఆహార పదార్థాలలో టమోటాలు అందించడానికి ప్రయత్నిస్తున్నామని సంస్థ నోటసుతో తెలిపింది. ఇకపై సబ్‌వే శాండ్‌విచ్‌లు, ఇతర ఆహార పదార్థాలలో కొంతకాలం పాటు టమోటాలు అందుబాటులో ఉండవు. ఇంతకుముందు మెక్‌డొనాల్డ్ తన ఆహార పదార్థాల నుండి ట మోటాలను కూడా తొలగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News