Saturday, November 23, 2024

సమష్టి కృషితోనే ఏ రంగంలోనైనా విజయం సాధ్యం

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : సమష్టి కృషితోనే ఏ రంగంలోనైనా విజయం సాధ్యమని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం పాత సెంటర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చిత్తలూరి ప్రసాద్ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల మాట్లాడుతూ వైజ్ఞానిక రంగంలో శాస్త్రవేత్తలు ఉపగ్రహాలు ప్రయోగించాలన్నా, వైద్యరంగంలో వైద్యులు కరోనా లాంటి మహమ్మారికి వ్యాక్సిన్లు కనిపెట్టాలన్నా, వి ద్యారంగంలో ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధించాలన్నా సమష్టి కృషితోనే సాధ్యమని, ఈ క్రమంలో జిల్లా, రాష్ట్రస్థాయి రికార్డులను ఉపాధ్యాయుల పనితీరుతో తల్లిదండ్రులలో నమ్మకం ఏర్పరిచి ప్రధాన ఉపాధ్యాయుల సమన్వయంతో మంచి ఫలితాలు సాధించి జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారుల మన్నలను పొందటం అభినందనీయమని, పాఠశాలలో నూతన విద్యార్థులను చేర్పించడంలో అవార్డు పొందిన అవార్డు పొందిన చిత్తలూరి ప్రసాద్ రాజశ్రీ దేవి దంపతులను ఘనంగా ఆయన సన్మానించారు.

పాఠశాల అభివృధ్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి ఎంపిపి దొడ్డా హైమవతి, మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేష్ మాట్లాడుతూ పెరిగిన విద్యార్థులు సంఖ్యకనుగుణంగా అదనపు తరగతి గదులు, ఏర్పాటు ఉపాధ్యాయుల కేటాయింపుకు తగు చర్యలు తీసుకొని పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన జేఏసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సాధన మలి విడత ఉద్యమంలో ప్రసాద్ బహు ముఖంగా కృషి చేశారన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సమన్వయ కర్తగా ఆయన చేసిన సేవలను వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రస్థావించారు.

అనంతరం స్వచ్ఛంద సంస్థలు, ఉద్యమ జేఏసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పక్షాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, సేవా సంస్థలు ప్రసాద్ రాజ్యశ్రీదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమం అనంతరం ప్రసాద్ తన స్పందనను తెలియ చేస్తూ తాను సాధించిన విజయాల వెనుక ఎందరి సహకారమో ఉందన్నారు. ముఖ్యంగా పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదని అన్నారు.

పాఠశాల యాజమాన్య కమిటీ, ఉపాధ్యాయ బృందం నిర్వహించిన చిత్తలూరి ప్రసాద్ అభినందన కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్.ఎం.రాజేశ్వరరావు, పిఆర్టీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోత్కూరి మధు, రంగారావు, రాజకీయ పక్షాల నుండి చల్లగుళ్ళ నరసింహారావు, దండు ఆదినారాయణ, మల్లూరు రాజు, స్వచ్ఛంద సంస్థల నుండి గార్లపాటి రామకృష్ణ, అయ్యదేవర శేషగిరిరావు, దారా ఏసురత్నం, రమణమూర్తి, కిరణ్, డా.కొనకళ్ళ సుధారాణి, పియల్.ప్రసాద్, జాగృతి సాగర్, దొడ్డా కృష్ణయ్య, ఉపాధ్యాయ సంఘాల నుండి మధుసూధనాచారి, రత్నాకర్, శ్రీకాంత్, పవన్, ఎం.వెంకటేశ్వరరావు, ఎం.సాంబశివరావు, వై.పురుషోత్తం, దుర్గాప్రసాద్, రాజు, కేశవరెడ్డి, ప్రకాశరావు, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News