Monday, December 23, 2024

లక్ష్య ఛేదనలో రష్యా జిక్రాన్ క్షిపణి సక్సెస్

- Advertisement -
- Advertisement -

Success of Russia Zikron missile in targeted interception

 

మాస్కో : కంటికి కన్పించకుండా, శబ్ధ వేగాన్ని మించి దూసుకువెళ్లి 1000 కిలోమీటర్ల దూరంలోని లక్షాన్ని ఛేదించిందీ రష్యాకు చెందిన క్షిపణి. ఈ జిక్రాన్ హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను రష్యా సైన్యం శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను మరింత ఉధృతం చేస్తున్న క్రమంలోనే రష్యా ఈ క్షిపణి పరీక్షకు దిగింది. బారెంట్స్ సీలోని అడ్మిరల్ గోర్షకోవ్ యుద్ధనౌక నుంచి దీనిని వేయి కిలోమీటర్ల దూరంలో అర్కిటిక్‌లోని వైట్ సీలో ఉన్న టార్గెట్‌పైకి ప్రయోగించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి విజయం సాధించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో తాము తలపెట్టిన వినూత్న ఆయుధాల పనితీరు సామర్థ పాటవ పరీక్షల క్రమంలో ఇప్పుడీ క్షిపణిని ప్రయోగించి చూసుకున్నట్లు వివరించారు. జిక్రాన్ శ్రేణి క్షిపణుల తొలి అధికారిక పరీక్ష ఇదేనని , ఇది విజయవంతం కావడం రష్యాకు ఘనమైన ఘట్టం అని అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇటువంటి క్షిపణుల రూపకల్పన జరిగి రెండేళ్లు అయింది. ఇప్పుడు వీటి సామర్థపు పరీక్షలు ఆరంభం అయ్యాయి. ఇక ముందు విరివిగా సాగుతాయని తెలిపారు. ఇప్పుడు జిక్రాన్ క్షిపణిని సముద్రంలోని జలాంతర్గామి నుంచి పరీక్షించారు. ఇప్పటి ప్రయోగ కేంద్రం నుంచే ఇంతకు ముందటిలాగానే తమ నూతన ఆయుధాల వ్యవస్థ పనితీరును పరీక్షించుకోవడం జరుగుతుందని పుతిన్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News