Sunday, December 22, 2024

విజయవంతంగా కొనసాగుతున్న జ్వర సర్వే

- Advertisement -
- Advertisement -

Successful continue Door-to-door fever survey

ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం డైరీని ఆవిష్కరించిన మంత్రి

హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్ళ సంఘం డైరీని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం కోకపేట్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సెక్రెటరీ బలరాం యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాళ్ళ సంఘం అధ్యక్షులు కె.ఎస్. రామారావు, జనరల్ సెక్రెటరీ కళింగ కృష్ణ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి తడితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని, రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జ్వర సర్వే విజయవంతంగా కొనసాగుతున్నదని, లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందిస్తున్నట్లు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News