Thursday, January 23, 2025

విజయవంతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా: జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించా రు. సోమవారం సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంక్షే మ పథకాల అమలుతో పాటు పలు అంశాలపై ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ అమో య్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షే మ పథకాల అమలులో మేడ్చల్ జిల్లా ముందు వరుసలో ఉందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం, ముఖ్యమంత్రి సమయనిధి, ఇళ్ల పట్టాల పంపిణీ, బీసీ కుల వృ త్తులకు ఆర్ధిక సహాయం, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మీపథకాలను పాదర్శకంగా అమలు చేస్తున్నామని, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణా లు చేపడుతున్నామని, వైకుంఠధామాలకు విద్యుత్, త్రాగునీరు సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.

ఇందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అధికారులు అప్రమత్తంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పారు. ఈ వీడి యో కాన్ఫరెన్స్‌లో జల్లా అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్తా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా గణాంక దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

జిల్లా గణాంక దర్శిని 2021, 2022 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంకాలు చాలా ముఖ్యమైనవని అన్నారు. రోజువారి జీవితంలో గణాంకాల వాడకం విధానాలను రూపొందించడలో గణాంకాలు దోహద పడతాయని తెలిపారు.

జిల్లా గణాంక దర్శిని జనాభా, వాతావరణం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్యా, రవాణా, నీటి వనరులు, పంటలు, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, లోకల్ బాడీ, ఇండస్ట్రీస్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు వివరంగా ఉంటాయని అన్నారు. గణాంక దర్శినిలో అన్ని శాఖల జిల్లా గణాంక వివరాలు పొందుపరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్తా, ముఖ్య ప్రణాళిక అధికారి మోహన్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News