Friday, January 10, 2025

విజయవంతమైన మోకాలు చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం సింగరేణి : సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో మోకాలు చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన పేషెంట్ కృష్ణమూర్తిని డైరెక్టర్ పా ఎన్.బలరాం ఆదివారం సిఎంఒ డాక్టర్ బి. వెంకటేశ్వరరావుతో కలిసి పరామర్శిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్స చేయడానికి ప్రోత్సహించిన సియంఒని, డాక్టర్ల బృందం విక్రమ్, రేష్మ, సువర్ణరేఖ, ఆర్థో సర్జన్స్, నాగరాజు, కృష్ణమూర్తి, అనేస్థీషియా ఓటి సిబ్బందిని అభినందించారు.

అదేవిధంగా సిఎంఒ డాక్టర్ బివిరావుకు ఇటువంటి సర్జరీలు చేయడానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ యాజమాన్యం సమకూరుస్తుందని తెలిపారు. మునుముందు కూడా సర్జరీలు మన ఆసుపత్రిలోనే జరిగే విధంగా చూడాలని అన్నారు. శస్థ్ర చికిత్స జరిగిన పేషెంట్ కృష్ణమూర్తి మాట్లాడుతూ తనకు చికిత్స చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట సిఎంఒ డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, డివైసిఎంవో నాగరాజు,సీనియర్ పివో మండల శ్రీనివాస్, మెట్రన్‌శాలీ, సిస్టర్ రాధ మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News