Thursday, December 26, 2024

విజయవంతంగా గాంధీ సినిమా ప్రదర్శన: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని స్ఫూర్తి పొందేందుకు జిల్లాలో ఆగష్టు 14 నుంచి 24 వరకు ప్రదర్శించిన గాంధీ సినిమా నాగర్‌కర్నూల్ జిల్లాలో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అమృతోత్సవాల్లో భాగంగా నేటితరం విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం, స్వాతంత్య్ర పోరాటం జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించిన గాంధీ సినిమాను ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ కలుపుకుని 7 సినిమా థియేటర్లలో రోజు ఉదయం ఒక షో పిల్లలకు ఉచితంగా ప్రదర్శించడం జరిగింది.

ఈ పది రోజుల్లో నాగర్‌కర్నూల్ జిల్లాలోని 7 థియేటర్లలో 55 షోలు ప్రదర్శించగా మొత్తం 23 వేల 32 మంది పాఠశాల విద్యార్థులు గాంధీ సినిమాను తిలకించినట్లు తెలిపారు. చివరి రోజు అయిన ఆగష్టు 24న 4 థియేటర్లలో 1389 మంది విద్యార్థులు సినిమా చూసి ఆనందించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సినిమాకు సురక్షితంగా తీసుకెళ్లి చూపించినందుకు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News