- Advertisement -
5వేల కిమీల టార్గెట్
న్యూఢిల్లీ : ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలనే ఛేదించే శక్తివంతమైన అగ్ని 5 క్షిపణి విజయవంతంగా కక్ష్యలోకి దూసుకుపోయింది. ఒడిషా తీరంలోని ఎపిజె అబ్దుల్ కలాం దీవుల నుంచి దీనిని బుధవారం పరీక్షించారు. ఉదయం 7.05 గంటలకు జరిగిన ప్రయోగం విజయవంతం అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ శత్రు భయంకర క్షిపణికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. 5000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌లను ఈ మిస్సైల్ దెబ్బతీయగలదు. అన్ని కోణాల నుంచి ప్రత్యర్థిని చిత్తు చేసే ఈ క్షిపణి మూడు దశల సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్‌తో ఉంటుంది. ముందుగా ఆయుధాలను వాడవద్దు, ఇతరులు వాడితే తగు జవాబు ఇవ్వడం జరుగుతుందనే విశ్వసనీయ ప్రతిఘటన పాలసీలో భాగంగా ఇండియా రక్షణశాఖ రూపొందించుకుంటూ వస్తున్న ఆయుధాల సంపత్తిలో ఇది అత్యంత కీలకమైన క్షిపణిగా నిలిచింది.
- Advertisement -