మన తెలంగాణ / హైదరాబాద్ : ఆడిట్ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 20 ప్రారంభమైన ఈ ఉత్సవాలు శుక్రవారం హైదరాబాద్‌లోని ఎజి ఆఫీసులో ముగింపు వేడుకలతో ముగిశాయి. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగం ఈ ఉత్సవాలను నిర్వహించింది. ఈ వేడుకల్లో ఆడిట్ కార్యాలయాల హెచ్‌ఓడిలు పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిధులుగా కమర్షియల్ ఆడిట్ డైరెక్టర్ జనరల్ ఎంఎస్ సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ జెఎస్. కరాపే,(ఖాతాలు , హక్కులు), ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ (సెంట్రల్), హైదరాబాద్ అనింద్య దాస్‌గుప్తా , ఐఎ అండ్ ఎఎస్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ సుహాసిని గోత్మారే ((సౌత్ సెంట్రల్ రైల్వేస్), ఎం. నాగేశ్వర రెడ్డి (ఐఎ అండ్ ఎఎస్ డిప్యూటీ డైరెక్టర్), పాల్గొన్నారు.
సంగీత ప్రదర్శనతో ముగింపు వేడుక ప్రారంభమైంది. స్వరమాధురి. ప్రియాంక ఎల్ నాయక్, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ హెచ్‌ఓడిలకు స్వాగతం పలికారు. ఆడిట్ వారోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు. హెచ్‌ఓడీలు ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆడిట్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు హెచ్‌ఓడిలచే బహుమతులు, అవార్డులను అందజేశారు.