Friday, November 22, 2024

జనాన్ని తాగుబోతులను చేస్తోంది ప్రభుత్వాలే

- Advertisement -
- Advertisement -

తమిళనాడు మద్యం మృతులపై నటుడు సూర్య స్పందన

చెన్నై: కల్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య శుక్రవారానికి 48కి చేరింది. దీనిపై ప్రముఖ నటుడు సూర్య స్పందించారు. ఆయన తమిళంలో రాసిన తన లేఖను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘ఒక్క ఘటనతో అనేక మంది చనిపోవడం ఊహించలేనిది. తుఫానులు, వానలు లేక వరదలప్పుడు చాలా మంది చనిపోయినప్పుడు  ఆక్రందనలు  హృదయ విదారకంగా, వెన్ను వణికించేదిగా ఉంటుంది. బాధితులను ఎలా ఓదార్చాలి. కల్తీ మద్యం తాగి వారంతా మరణిస్తే వారి కుటుంబ సభ్యులను ఎలా ఓదార్చేది?’’ అంటూ ఆయన రాసుకొచ్చారు.

నటుడు సూర్య తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి లేఖ రాశారు. ‘‘కొందరికైనా ఊరటనిచ్చే చర్యలు చేపట్టండి. దీర్ఘకాలిక సమస్యలకు తాత్కాలిక ఉపశమనం అంత ప్రభావ వంతంగా పనిచేయదు’’ అన్నారు.

గత ఏడాది విల్లుపురంలో కూడా ఇలాగే 22 మంది చనిపోవడాన్ని ఆయన ఉటంకించారు. ‘‘అదే కల్తీ మద్యంతో ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికీ మార్పు రాకపోవడం బాధ కలిగిస్తోంది’’ అని పేర్కొన్నారు.

రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన అనేక ప్రభుత్వాలు తమిళనాడు రాష్ట్రంలో ప్రజలని వంచిస్తున్నాయి. తమ బతుకులు బాగుపరుస్తారని ప్రభుత్వాలను ఎన్నుకుంటే, ఆ ప్రభుత్వాలే మరింత తాగుబోతులను తయారుచేస్తున్నాయి. పైగా టిఏఎస్ఎంఏసి(తమిళనాడు ప్రభుత్వం నడిపించే రిటైల్ లిక్కర్ దుకాణాలు) ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు ‘మద్య నిషేధం’ గురించి కల్లబొల్లి మాటలు చెబుతున్నాయి అని సూర్య పేర్కొన్నారు.

Ramdoss

Kallakurchi Funerals

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News