Thursday, January 23, 2025

చిలుకూరులో దొంగల బీభత్సం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఒక్కొక్కరి ఇండ్లలో 4 సెల్ ఫోన్లు, నగదు, మోటర్లు చోరీ చేశారు. ఓ మహిళ మెడలో నుండి బంగారు గొలుసు లాగుతుండగా దొంగల్లో ఒకరిని పట్టుకున్న గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు.

యువత గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడి ఇలా తయారవుతున్నారని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోరీలకు పాల్పడిన వారు చిలుకూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ కాకుండా చూసుకోవాలని గ్రామస్తులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News