Wednesday, January 22, 2025

ఇంతగొప్ప అభివృద్ధ్ది కటికనపల్లికే సాధ్యం

- Advertisement -
- Advertisement -

ధర్మారం: కటికనపల్లి సర్పంచ్ కారుపాకల రాజయ్యను మంత్రి ఈశ్వర్ అభినందించారు. గొప్ప అభివృద్ధి చేశావంటూ ప్రశంసల తో ముంచెత్తారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన మంత్రి ఈశ్వర్‌కు సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. సర్పంచ్, ఉపసర్పంచ్ రామడుగు గంగారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షు డు మానుసాటి సాయిలు, యూత్ అధ్యక్షుడు బో నగిరి శ్రీనివాస్, మండల మహిళా విభాగం అధ్యక్షులు గుజ్జేటి కనకలక్ష్మితోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రధాన రహదారి నుండి గ్రా మంలోని ప్రాథమిక పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా మహిళలు మంత్రికి మంగళ హారతులతో స్వాగతం పలికారు.

మంత్రి ఈశ్వర్ సమక్షంలో సుమారు 50 మంది మహిళ లు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కా రుపాకల రాజయ్య సర్పంచ్‌గా గ్రామానికి చేస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. నిరంతరం గ్రా మ అభివృద్ధి కోసం తపన పడుతూ, ప్రభుత్వాన్ని తనను ఒప్పించి కేవలం నాలుగేళ్లలోనే 3.5 కోట్ల తో అభివృద్ది పనులు చేయడం సంతోషకరమని అ న్నారు. గ్రామంలోని వాడవాడల్లో సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామాలు, పచ్చదనంతో కూడిన చెట్లు, ఆలయాల అభివృద్ధి, సంఘ భవనా ల నిర్మాణం, విద్య వైద్యాభివృద్ధికి ఎనలేని కృషి చే సి అందరి ప్రశంసలు పొందాడని మంత్రి మెచ్చుకున్నారు. ఇంత అభివృద్ధి సర్పంచ్‌గా రాజయ్యతో నే సాధ్యమైందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని గుర్తించాలని మం త్రి ఈశ్వర్ కోరారు.

సర్పంచ్ రాజయ్య మాట్లాడు తూ కటినపల్లి గ్రామం ఇంత అభివృద్ధి చెందడాని కి తనను మంత్రి ఈశ్వర్ ఎంతో ప్రోత్సహించార ని, గ్రామాభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున నిధులు వి డుదల కావడం తన హయంలో అభివృద్ధి జరగ డం తనకు సంతోసంగా ఉందన్నారు. ఊరు ఊ రంతా ఒక్క తాటిపై ఉండి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని మంత్రి ఈశ్వర్ విజయం కోసం కృషి చేస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News