Wednesday, January 22, 2025

కుమారుడి మృతదేహం పక్కన లేఖ రాసి పెట్టిన సిఇఒ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తన కుమారుడిని మైండ్‌పుల్ ఎఐ సంస్థ సిఇఒ సుచనా సేత్ చంపేయడంతో ఆమె మానసిక స్థితిపై అనేక అనుమానాలు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆమె కుమారుడి మృతదేహం పక్కన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానంలో భర్తతో విడాకుల కేసు, బాలుడి కస్టడీపై ఆమె ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించారు. తీవ్ర మానసిక వేధనతో హత్య చేసినట్లు తెలుస్తోంది. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే కుమారుడు మాత్ర తన దగ్గరే ఉండాలని ఆమె నిర్ణయించుకుంది, కస్టడీ హక్కు తనకే దక్కాలని కోరుకున్నట్టు లేఖలో ఉంది.

పోలీసుల విచారణకు మాత్ర సుచనా ఏ మాత్రం సహకరించడంలేదు. కుమారుడి హత్య విషయంలో ఆమెలో బాధ కనిపించడంలేదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె మానసిక, శారీరకపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె బ్యాగ్‌లో దొరికన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. భర్తతో విడాకుల సమస్యతో పాటు కోర్టు ఆదేశాలతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైనట్లు సమాచారం. 2022 నుంచి దంపతుల మధ్య విడాకుల కేసులో కోర్టులో ఉంది. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. కుమారుడు ప్రతి ఆదివారం తండ్రి దగ్గర ఉంచాలని కోర్టు ఆదేశించడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News