Sunday, December 22, 2024

కొడుకుని ఎందుకు చంపిందో ఆమెకే తెలియాలి..

- Advertisement -
- Advertisement -

తన కుమారుణ్ని ఎందుకు చంపిందో తన మాజీ భార్యకే తెలియాలని వెంకటరామన్ అన్నారు. ఆయన శనివారం గోవా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. హత్య వెనుక అసలు కారణం ఆమె చెబితేనే తెలుస్తుందని ఆయన అన్నారు. సుచనా సేఠ్ నాలుగు రోజుల క్రితం గోవాలో తన కన్నబిడ్డను చంపేసి సూట్ కేసులో మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు పణజీలోని కలంగుట్ పోలీస్ స్టేషన్ కు సుచనా మాజీ భర్త వెంకటరామన్ వచ్చారు. ఈ సందర్భంగా కొందరు విలేఖరులు ఆయనను కలవగా, ఆయన తరఫున న్యాయవాది స్పందించారు.

సుచన, వెంకటరామన్ 2010లో వివాహం చేసుకున్నారనీ, ఎనిమిదేళ్ల తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని న్యాయవాది చెప్పారు. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే విషయమై కేసు నడుస్తోందన్నారు. ఈలోగా తండ్రి తన కుమారుణ్ని ఇంటివద్ద కలుసుకోవచ్చునని కోర్టు తెలిపింది. దీనిప్రకారం వెంకటరామన్ అప్పుడప్పుడు వచ్చి తన కుమారుణ్ని చూసి వెళ్తున్నారనీ, కానీ గత ఐదు వారాలుగా సుచన తన కుమారుణ్ని వెంకటరామన్ కు చూపించడం లేదన్నారు. ఈనెల ఏడవ తేదీన వెంకటరామన్ తన కుమారుణ్ని కలుసుకోవలసి ఉండగా, ఎన్ని గంటలు నిరీక్షించినా సుచన రాలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News