Sunday, December 22, 2024

సూడాన్‌లో బాంబుల మోత… 25 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఖర్టోమ్: సూడాన్‌లో పారామిలిటరీ బలగాలు, సూడాన్ ఆర్మీకి మధ్య విభేదాలు రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పారామిలిటరీ గ్రూప్, సూడాన్ ఆర్మీ మధ్య వైమానిక దాడులు చేసుకోవడంతో 25 మంది మృతి చెందగా 183 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణలు సూడాన్ రాజధాని ఖర్టోమ్ నగరం శివారులో జరిగింది. పారామిలటరీ బలగాలను సూడాన్ సైన్యంలో విలీనం చేసేందుకు ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలను సూడాన్ సైన్యం తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. బాంబుల వర్షం కురుస్తుండడంతో పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. సూడన్‌లో ఉన్న భారతీయులు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని భారత ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఘర్షణలకు సూడాన్ సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హన్, పారామిలిటరీ కమాండ్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని రోజులు విబేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ విభేధాలు ఘర్షణలకు కారణమని స్థానిక మీడియా వెల్లడించింది. ఇద్దరు మధ్య ఆధిపత్య పోరుకు ప్రజలు బలవుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read:  పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News