Sunday, November 3, 2024

బైడెన్‌కు స్వాగతం కోసం 2 వేల ప్రమిదలతో సైకత శిల్పం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జి20 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రమ/క సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో 2000 మట్టి ప్రమిదలను ఉపయోగించి ఆరడగుల సైకత శిల్పాన్ని సృష్టించారు. ఈ సైకత శిల్పంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జి20 లోగోతో పాటుగా ‘ వెల్‌కమ్ టు భారత్’ అనే సందేశం ఉన్నాయి. ఈ సైకత శిల్పాన్ని రూపొందించడానికి దాదాపు 5 టన్నుల ఇసుక ఉపయోగించారని, పట్నాయక్ శాండ్ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు కూడా ఇందులో పాలు పంచుకున్నారని పట్నాయక్ తెలిపారు. అతిథులను దీప హారతితో స్వాగతించడం మన సంప్రదాయని, అందుకే బైడెన్‌కు స్వాగతం పలకడానికి దివ్వెలను ఉపయోగించామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News