Saturday, April 5, 2025

నూహ్‌పై తప్పుడు సమాచారం..సుదర్శన్ న్యూస్ ఛానల్ ఎడిటర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సుదర్శన్ న్యూస్ టీవీ ఛానల్ ఎడిటర్ ముఖేష్ కుమార్‌ను గురుగ్రామ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తప్పుడు సమాచారంవ్యాప్తి కారణంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. హర్యానాలోని నూహ్, ఇతర జిల్లాల్లో ఇటీవలి మతఘర్షణల దశలో ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే రీతిలో ఉండే అంశాలను వెలువరించారని అభియోగాలు ఉన్నాయి. వీటి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని గురుగ్రామ్ పోలీసులు ఆయనను సెక్టార్ 17లో అదుపులోకి తీసుకున్నారు.

ఘర్షణల సమయంలో ఆయన పోస్టింగ్‌లు దురుద్ధేశపూరితంగా ఉన్నాయని అధికారులు నిర్థారించుకుని ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడైంది. తమ ఛానల్ రెసిడెంట్ ఎడిటర్‌ను ఎవరో గూండాలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని ముందుగా ఛానల్ వార్తలు వెలువరించింది. దీనికి స్పందనగా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయనను సైబర్ క్రైమ్ విభాగం అరెస్టు చేసిందని ఇందులో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News