Tuesday, November 5, 2024

జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

- Advertisement -
- Advertisement -

గతంలో కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అనుభవం

మన తెలంగాణ/హైదరాబాద్: జలమండలి నూతన ఎండీగా సి. సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన దానకిశోర్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. నూతన ఎండీకి జలమండలి అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

నేపథ్యం, వివరాలు :
సుదర్శన్ రెడ్డి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు – 2002 బ్యాచ్ కి (తెలంగాణ క్యాడర్) చెందిన అధికారి. 2002 నుంచి 2003 వరకు ఉత్తరాఖండ్ లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత 2003 లో ఖమ్మం జిల్లాకు శిక్షణలో భాగంగా వెళ్లారు. 2004 ఆగస్టు నుంచి 2005 వరకు అప్పటి విశాఖ పట్నం జిల్లా పాడేరులో సబ్ కలెక్టర్ గా పనిచేశారు. 2005 డిసెంబరు నుంచి 2006 వరకు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు. 2006 జులై నుంచి 2007 సెప్టెంబరు వరకు తూర్పు గోదావరి జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. 2007 సెప్టెంబరు నుంచి 2009 సెప్టెంబరు వరకు కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ చార్మినార్ డివిజన్ లో డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. 2009 సెప్టెంబరు నుంచి 2012 జులై వరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2012 జులై నుంచి 2014 వరకు కర్నూలు జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. 2014 ఆగస్టు నుంచి 2015 మార్చి వరకు కమర్షయల్ టాక్స్ డిపార్ట్ మెంట్ కమిషనర్ కు సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.

ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. 2015 మార్చి నుంచి 2017 సెప్టెంబరు వరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా పనిచేశారు. అనంతరం 2017 సెప్టెంబరు నుంచి 2019 డిసెంబరు వరకు రక్షణ శాఖలో డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు. తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చేశారు. 2020 జనవరి నుంచి 2023 డిసెంబరు 17 వరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. తాజాగా జలమండలి ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇప్పటి దాకా జలమండలి ఎండీగా పనిచేసిన దానకిశోర్.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతిపై వెళ్లారు. ఆయన జలమండలి చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన మేనేజింగ్ డైరెక్టర్ గా రికార్డు సృష్టించారు. 2016 ఏప్రిల్ లో ఛార్జ్ తీసుకున్న ఆయన.. 2023 డిసెంబరు వరకు ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో.. ఐటీ, రెవెన్యూ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాలో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారు. జలమండలికి అనేక అవార్డులు తీసుకొచ్చి బోర్డు ప్రతిష్ఠను మరింత పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News