Wednesday, January 22, 2025

‘గ్రీన్ఇండియా చాలెంజ్’ పాల్గొన్న సుద్దాల అశోక్ తేజ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా హైదరాబాద్ లో శ్రీ నగర్ కాలనీలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మొక్కల నాటారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ని అద్భుతంగా కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ని ఆకుపచ్చ చందమామగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం మరింత విజయం సాధించాలని ఆల్ ద బెస్ట్ చెప్పారు. తాను రాసిన ”నేను అడవిని మాట్లాడుతున్నాను” వచన రూప కవిత్వం పుస్తకాన్ని ఎంపీ సంతోష్ కుమార్ కి బహుమతిగా పంపారు.

Suddala Ashok Teja plant sapling in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News