Sunday, January 19, 2025

దాసర్‌దొడ్డి సర్పంచు ఆకస్మిక మృతి

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మండలంలోని దాసర్‌దొడ్డి గ్రామ సర్పంచు గుల్ల మారెప్ప (57) ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, ఇటీవలే కోలుకోవడంతో గ్రామానికి వచ్చారు. అయితే ఆదివారం ఉదయం 8గంటల ప్రాంత ంలో ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు మక్తల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సర్పంచు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

విషయం తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గ్రామానికి చేరుకుని మారెప్ప మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిసిసి అధ్యక్షులు వాకిటి శ్రీహరి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, ఇతర నాయకులు మారెప్ప మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబసభ్యులను పరామర్శించారు. మారెప్పకు కుమారుడు రాజు, ఒక కుమార్తె ఉన్నారు. సోమవారం ఉదయం మారెప్ప అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News