Wednesday, January 22, 2025

ఆధ్యాత్మికవేత్త అష్టకాల హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /చిన్నకోడూరు: అవధాన సరస్వతీ, విఖ్యాత సంస్కృతాంధ్ర పండితులు.. అష్టావధాని, సరస్వతీ క్షేత్ర నిర్మాత క వి, రచయిత అష్టకాల నృసింహ రామ శర్మ (80) బుధవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అష్టకాల ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అష్టావధానిగా వాస్తు జ్యోతిష్య పండితుడిగా ప్రసిద్ధ్ది చెందారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుకు అత్యంత ఆత్మీయుడు, అవధానాలు చేస్తూ వచ్చిన డబ్బు, దాతల సహకారంతో అనంత సాగర్ శివారులో సరస్వతి క్షేత్రం నిర్మిం చారు. అది దినాదినాభివృద్ధ్ది చెందుతున్నది.

ఈ క్రమంలో అష్టకాల రోజు మాదిరిగా బుధవారం తన ద్విచక్ర వాహనం పై సరస్వతి క్షేత్రానికి వెళ్లి వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో గుండెనొప్పి రావడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అసుపత్రిలో మరోసారి గుండె పోటు రావడంతో మృతి చెందారు. అష్టకాలకు భార్య రత్నాబాయి, నలుగురు కుమారులు, కూతురులు ఉన్నారు. అష్టకాల మరణవార్త తెలుసుకున్న సాహితీ ప్రియులు ,కవులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతికాయానికి నివాళులు ఆర్పించారు. అనంతసాగర్ సరస్వతి క్షేత్రం సమీపంలో శుక్రవారం జరగనున్న అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

అష్టకాల సేవలు చిరస్మరణీయం :సిఎం

ప్రముఖ సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త, అష్టావధాని, అష్టకాల నృసింహరామ శర్మ (80) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక సాహితీవేత్తగా, ఆయా రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అష్టకాల ఆధ్యాత్మిక సాహిత్య కృషి…సిద్ధిపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింప చేశాయన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంత్రి హరీశ్‌రావు సంతాపం

అష్టకాల నృసింహర్మ మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆకాల మరణం పట్ల మండలంలోని జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News