లండన్ : గర్భిణులు పొగాకు నమలడం లేదా వినియోగించడం వంటివి చేస్తే గర్భస్థ శిశువు ఆకస్మికంగా మరణించే ప్రమాదం మూడు రెట్లు ఉంటుందని నూతన సమగ్ర రిజిస్ట్రీ అధ్యయనం వెల్లడించింది. తల్లి గర్భస్థ మొదటి పరీక్షకు ముందే పొగాకును వినియోగించడం మానేస్తే రిస్కు చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనం వివరించింది. స్వీడన్ లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. అన్నిరకాల నికొటిన్ ఉత్పత్తులను గర్భం సమయంలో విడిచిపెట్టాలని పరిశోధకులు హెచ్చరించారు. జర్నల్ పీడియాట్రిక్ రీసెర్చిలో ఈ అధ్యయనం వెలువడింది. “ అదృష్టవశాత్తు ఆకస్మికంగా శిశువు మరణించే రిస్కు చాలా తక్కువ. కానీ పొగాకును నమలడం కానీ, లేదా పొగతాగడం కానీ గర్భిణులు చేస్తే రిస్కు చాలా ఎక్కువగా ఉంటుందని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు, పిల్లల వైద్యులు అన్నా గున్నెర్‌బెక్ స్పష్టం చేశారు.
ఈ పరిశోధనలో స్వీడన్‌లో 1999 నుంచి 2019 మధ్య కాలంలో పుట్టిన 2 మిలియన్ శిశువులను అధ్యయనం చేశారు. ఈ సమయంలో కేవలం 10,000 శిశువులే ఆకస్మికంగా మరణించారు. నిద్ర లోనే ఆకస్మికంగా ఎప్పుడు మరణిస్తారో చెప్పలేమని పేర్కొన్నారు. తల్లి సంరక్షణ పై ప్రత్యేకంగా పరిశీలించగా, ఒక శాతం తల్లులే పొగాకును నములుతున్నట్టు , ఏడు శాతం పొగతాగుతున్నట్టు తేలింది. గర్భిణులు పొగాకును నమలడం లేదా ముక్కుపొడి పీల్చడం వల్ల 70 శాతం శిశువు ఆకస్మికంగా మరణించే రిస్కు మొదటి సంవత్సరంలో ఉంటుంది. అయితే దీన్ని పొగతాగడంతో పోలిస్తే రిస్కు చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది. రోజుకు ఒకటి నుంచి తొమ్మిది సిగరెట్లు కాల్చితే , అంతకన్నా ఎక్కువగా పది సిగరెట్లు కాలిస్తే పెద్ద రిస్కే తప్పదు. గర్భిణులు ప్రారంభంలో అంటే గర్భస్థ పరీక్ష మొదటిసారి తీసుకునే ముందే పొగాకు ఉత్పత్తుల వినియోగం మానేస్తే రిస్కు తక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది.