Saturday, April 5, 2025

అల్లుడు రిషి సునాక్ క్షేమం కోరుతూ సుధామూర్తి పూజలు

- Advertisement -
- Advertisement -

 

సింధుదుర్గ్ ( మహారాష్ట్ర): అల్లుడు, బ్రిటన్ ప్రధాని అయిన రిషి సునాక్ క్షేమం కోరుతూ రచయిత్రి సుధామూర్తి మహారాష్ట్ర లోని సింధ్‌దుర్గ్ ఆలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ముంబైకి 500 కిమీ దూరంలో ఉన్న దేవగఢ్ తహశీల్‌కు నిన్న సాయంత్రం ఆమె వచ్చారు. బాపర్డే గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో బుధవారం ఉదయం పూజలు చేశారు. ఈ పర్యటనలో బాపర్డే గ్రామంలో యశ్వంత్‌రావు రాణే హయ్యర్ సెకండరీ స్కూలు విద్యార్దులతో ఆమె ముచ్చటించారు. ఈమేరకు వీడియోలో ఆమె పూజలు చేయిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News